Monday, April 29, 2024

ఆర్టీసిని లాభాల బాటలో ముందుకు తీసుకుపోతాం: మంత్రి పొన్నం ప్రభాకర్

- Advertisement -
- Advertisement -

మాదాపూర్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థలో విధులు నిర్వహిస్తున్న సంస్థ ఉద్యోగులు నిబద్దతతో పనిచేసి ఆర్టీసిని లాభాల బాటలో ముందుకు తీసుకొని పోవాలని రవాణా శాఖ, బిసి సంక్షేహ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కొండాపూర్ 8వ పోలీస్ బెటాలియన్‌లో కమాండెంట్ సన్ని ఆధ్వర్యంలో టిఎస్‌ఆర్టీసికి చెందిన 82 మంది కానిస్టెబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్, ఆర్టీసి సంస్థ ఎండి వీసీ సజ్జనార్ ఐపిఎస్‌లు హజరై శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గోన్నారు.

అనంతరం మంత్రి పోన్నం ప్రభాకర్ మాట్లాడుతు కొత్తగా విధుల్లో చేరబోతున్న కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేశారు. నిబద్దతతో పనిచేయాలన్నారు. సంస్థలొని 50వేల మంది సిబ్బందిని, బస్సులను కాపాడాల్సిన బాధ్యత తమరిపై ఉందనే విషయం మరచిపోవద్దన్నారు. రాబోయే కాలంలో ఆర్టీసిని ఇంకా ముందుకు తీసుకొని పోయి లాభాల బాట పట్టేల్లు చూడాలన్నారు. కారుణ్య నియామకం ద్వారా టిఎస్ ఆర్టీసిలో ఇటీవల 80 మంది కానిస్టేబుళ్లుగా నియమితులయ్యారన్నారు. వారిలో 33 మంది పురుషులు కాగా 48 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.

టిఎస్ ఆర్టీసి ఎండి వీసీ సజ్జనార్ ఐపిఎస్ మాట్లాడుతు కొత్తగా 82 మంది కానిస్టేబుళ్లు టిఎస్ ఆర్టీసిలో చేరతున్నందున ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కొత్త రక్తంతో సంస్థ మరింత అభివృద్ది పథంలో ముందుకుళ్తుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శిక్షణలో మాదిరిగానే నిబద్దతతో విధులు నిర్వహించాలని కానిస్టేబుళ్లకు సూచించారు. చిత్తశుద్దితో పని చేస్తూ సంస్థ అభ్యున్నతికై మీవంతుగా తోడ్పాడునందించాలన్నారు. ఒక ఎలలో సమర్థవంతంగా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చిన టిఎస్‌ఎస్పి అదనపు డీజీపీ స్వాతి లక్రా, కొండాపూర్ 8వ బెటాలియన్ కమాండెంట్ సన్నిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమంలో టిఎస్ ఆర్టీసి కృష్ణకాంత్, 8వ బెటాలియన్ అదనపు కమాండెంటు కె. సుబ్రమణ్యం తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News