Monday, May 13, 2024

మణిపూర్‌లో 6 పోలింగ్ బూత్‌ల్లో ఈనెల 30న రీపోలింగ్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : లోక్‌సభ ఎన్నికల రెండోవిడత పోలింగ్‌లో ఈ నెల 26న హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న ఔటర్ మణిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం లోని 6 పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 30న రీపోలింగ్ జరుగుతుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ రద్దయిన 6 కేంద్రాల్లో నాలుగు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడానికి ముందే గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లను ధ్వంసం చేశారు.ఒక పోలింగ్ స్టేషన్‌లో ఓటింగ్ మిషన్‌లో సమస్యలు తలెత్తాయి.

కొందరి బెదిరింపులు, భయాల మధ్య మరో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ పూర్తి కాలేదు. మణిపూర్‌లో ఏప్రిల్ 19న జరిగిన తొలి విడత ఎన్నికల్లోనూ ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గంలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. సుమారు 3000 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగ్గా, 11 పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈవీఎంలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో 11 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్ చెల్లదని ఈసీ ప్రకటించింది. రెండో విడత పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఏప్రిల్ 22న రీపోలింగ్ నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News