Monday, May 13, 2024

ఆప్ ప్రచార గీతానికి ఎన్నికల కమిషన్ షాక్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ రూపొందించిన పాటకు ఎన్నికల సంఘం అభ్యంతరం తెలిపింది. ఎన్నికల ప్రచార సభలో భాగంగా ఆప్ వాడుతున్నపాటలో పలుమార్లు రీపీట్ అవుతున్న నినాదం పట్ల ఈసీ అభ్యంతరం తెలిపింది. పాటలో మార్పులు చేయాలని , మార్పులు చేసిన తరువాత మళ్లీ తమ ఆమోదం తీసుకోవాలని సూచించింది. ప్రచార ప్రకటనలో “జైల్ కె జవాబ్‌మే హమ్ ఓట్ సే దేంగా” అన్న నినాదం వచ్చినప్పుడు కేజ్రీవాల్ జైలులో ఉన్న చిత్రాన్ని ప్రదర్శిస్తున్న గుంపు అంతా కలిసి న్యాయవ్యవస్థను దూషించినట్టుగా పాటలో ఉంది. న్యాయవ్యవస్థ పై నిందలు వేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుందని ఈసీ పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఆప్ తప్పు పట్టింది. ఎన్నికల సంఘం ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది.

“ విపక్ష నేతలపై దాడులకు ఈడీ, సిబిఐ లను బీజేపీ ఉపయోగిస్తుంటే వాళ్లను ఈసీ మార్చలేదు. తప్పుడు ఆరెస్టులు చోటు చేసుకున్నాయంటూ ప్రచారంలో ఎవరైనా మాట్లాడితే మాత్రం ఎన్నికల సంఘం దానిని ఒక సమస్యగా చూస్తోంది. నియంతృత్వ ప్రభుత్వం లక్షణం ఇది ” అని ఆప్ నేత ఆతిషీ ఆరోపించారు. దీనికి ముందు ఆదివారం ఉదయం కేజ్రీవాల్‌కు మద్దతుగా “వాక్ ఫర్ కేజ్రీవాల్‌” పేరుతో పాదయాత్రతో ఆప్ ప్రచారం చేసింది. ఢిల్లీ లోని సీఆర్ పార్కు నుంచి ఈ పాదయాత్ర సాగింది. జైల్ కా జవాబ్ ఓట్ సే అనే నినాదాలతో కేజ్రీవాల్ ఫోటో, పార్టీ జెండాలతో ఆప్ మద్దతు దారులు ఇందులో పాల్గొన్నారు. ఆప్ మంత్రులు ఆతిషీ, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News