Thursday, May 23, 2024

లారీ బస్సు ఢీకొని ఆరుగురి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నవ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకు వచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హర్దోవ్ ఉన్నవ్ రహదారిపై సఫీపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని జమల్దిపూర్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన 11 మందిని కాన్పూర్ ఆస్పత్రికి, స్వల్పంగా గాయపడిన వారిని ఉన్నవ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు డ్రైవర్ పరారీ కాగా, లారీ డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News