Tuesday, May 14, 2024

కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని వాటిని మోడీ సృష్టిస్తున్నారు : చిదంబరం

- Advertisement -
- Advertisement -

గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ, ఇతర బీజేపీ నాయకులు కాంగ్రెస్ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఆక్షేపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం తన ఎక్స్(ట్విటర్ ) ఖాతాలో ట్వీట్ చేశారు. కాంగెస్ మేనిఫెస్టోలో “వారసత్వ పన్ను ” అనే పదం ఎక్కడా లేదని, తాము రూపొందించని ఒక మేనిఫెస్టోను వారు సృష్టించుకుని సభల్లో పదేపదే చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఈ అంశాలపై మోడీ చర్చించాలని డిమాండ్ చేశారు. శామ్ పెట్రోడా ప్రస్తావించిన ‘వారసత్వ పన్ను’ వ్యాఖ్యలపై

ప్రధాని మోడీ అదేపనిగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్న నేపథ్యంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు మేనిఫెస్టోలో లేని అంశాలను మోడీ ప్రస్తావించడం ఏమాత్రం సరికాదని చిదంబరం ఆక్షేపించారు. మోడీ మూడోసారి అధికారం లోకి వస్తే చాలా విపరీతాలు జరిగే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనప్పటికీ, ఇండియా కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత దానిని రద్దు చేస్తామని చిదంబరం హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News