Friday, May 24, 2024

ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు: 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బెమెతారా ప్రాంతంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ట్రక్కు ఢీకొనడంతో పది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 23 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తిరైయా గ్రామంలో ఓ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులది పతర్రా గ్రామంగా గుర్తించారు. మృతులలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యటు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News