Sunday, May 19, 2024

తెలంగాణకు ఏమీ చెయ్యని మోడీకి ఎందుకు ఓటెయ్యాలి?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఎల్‌బినగర్: కేంద్రం లో పదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క పని కూ డా చేయలేదని, అలాం టి పార్టీకి ఓటు ఎందుకు వేయాలని రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పిన తరువాతే ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రావాలని ఎల్‌బినగర్‌లో ఆదివా రం రాత్రి జరిగిన కార్నర్ మీటింగ్‌లో డి మాం డ్ చేశారు. అలాగే దేశంలో రిజర్వేషన్లు ఎందు కు రద్దు చేస్తారో చెప్పాలని మోడీని రే వంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చి ఓట్లు ఎలా అడుగుతున్నారో బిజెపి నేతలు వివరణ ఇవ్వాలన్నా రు. ఎల్‌బినగర్ నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం సుష్మా నుంచి వనస్థలిపురం రైతుబజార్ వరకు సిఎం రేవంత్‌రెడ్డి ర్యాలీగా వ స్తూ ప్రజలకు అభివాదాలు తెలిపారు. రైతుబజార్ ముందు ఏ ర్పాటు చేసిన కార్నర్ మీ టింగ్‌లో ఆయన తరువాయి 10లో
(మొదటిపేజీ తరువాయి)
మట్లాడుతూ మరోసారి మోడి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని విమర్శించా రు. పాలమూర్ ,రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలేదని , ప్రధాని మంత్రి మన ప్రాంతానికి ఓక పైసా ,ఓక ప్రాజెక్టు అందజేయలేదని , భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని, భాజపా మోడి రాక ముందు మనతాతలు ,ముత్తాతలు శ్రీ రాంనవమి ,హనుమన్ జయంతి , బోనాలు ,బతుకమ్మ పండుగలు జరుపుకోలేదా ? భాజపా వాళ్లు రహదారు ల మీద నుంచి శ్రీరాముని చూపించి ఓట్లు అడుగుతున్నారని ,దేవుడు గుడి లో ఉండాలని ,భక్తి గుండెల్లో ఉండాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి 11 మంది కార్పోరేటర్లు గెలిపిస్తే ఎమి చేయలేదని ,ఈటెల రాజేందర్ మీ సమస్యలపై మాట్లాడాడ అని ప్రశ్నించారు? రాజేందర్ అమిత్‌షా ,మోడితో మాట్లాడి ఎల్బీనగర్‌కు నిధులు తెచ్చారో అని అడిగారు ,ఎల్బీనగర్‌లో వరదలు వచ్చినప్పుడు భాజపా అప్పటి అధ్యక్షులు బండి సంజయ్ బండి పోతే బండి అని ,గుండి పోతే గుండి ,లారీ పోతే లారీ ఇస్తానని , బండి రాలేదని ,గుండు రాలేదని విమర్శించారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి నిధులు తేలదన్నారు. మోడి గుజరాత్‌కు నిధులు ఇస్తున్నారని ,తెలంగాణకు మాత్రం సున్నా ఇవ్వలేదని , మోడి తెలంగాణకు ఐటిఐర్ కారిడర్ పెట్టుబడులు ఇవ్వలేదని ,

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కారు గ్యారేజీకి వెళ్లిందని ,కారు టైర్లు జుమ్మరత్ బజార్‌లో ఉన్నాయని ,కారు పోయి బస్సులో బయల్దేరారని విమర్శించారు. పదేళ్లు సీఎం హోదాలో సచివాలయానికి రాక ,ఇప్పుడు ఏ ముఖం పెట్టుకోని ఊరూరా తిరుగుతున్నాడని ప్రశ్నించారు? ఇ ప్రాంతంలో ఆర్టీసీ సోదరులు ఉంటారని ,ప్రభుత్వం ఆర్టీసీకి 1360 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నామని ,యాదగిరిగుట్ట ,భద్రచాలం మహిళలు పోవాలంటే ఓక పైసా చెల్లించకుండా దైవదర్శనం చేసుకుంటున్నారని ,అమ్మ వారింటికి వెళ్లలంటే ఉచితంగా ప్రయాణిస్తున్నారని ,500 గ్యాస్ సిలిండర్ ,200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. నాడు మల్కాజిగిరి ఎంపిగా ప్రశ్నించే గొంతుకగా గెలిపించారో … నేడు పట్నం సునీతాను గెలిపించాలని ముఖ్యమంత్రి సృష్టం చేశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నాడు 2019లో ఎల్బీనగర్‌లో 29 వేల ఓట్ల మెజారీటీతో గెలిపించి పార్లమెంట్‌కు మీరే పంపారని, అనంతరం పీసీసీ అధ్యక్షునిగా ముందకు వచ్చానన్నారు. నేడు మీ ముందుకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చానని, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి సోదరులు ఇక్కడ నివాసం ఉంటున్నారని, ప్రశ్నించే గొంతుగా అనాటి ప్రభుత్వాన్ని మెడల వంచి నాకు అండగా ఉన్నారని, మీ ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయ్యానని పేర్కొన్నారు.

మీ త్యాగం, ఇ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందని, మూసీ ప్రక్షాళన, తాగునీరు, డ్రైనేజీ, జీవో.నెం.118 పట్టాలను పరిష్కారించాల్సిన బాధ్యత నా మీద ఉందన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ ఏడు అసెంబ్లీ స్థానాలు గెలవకపోవడం, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థ్ది సునీతా మహేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. సునీతాను గెలిపిస్తే అటు పార్లమెంట్‌లో మీ సమస్యలు పరిష్కారిస్తారని, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి గత 35 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నారని ఎల్బీనగర్‌లో సందు సందు ఆయనకు తెలుసని, నాకు సగం మంది చుట్టాలు ఉన్నారని,అనాడు ఎలా ఆశీర్వాదించారో, సునీతాను 30 వేల ఓట్ల మెజారీటీతో గెలిపించాలని, కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ , ఎల్బీనగర్ నుంచి చంద్రాయణగుట్ట, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ మెట్రో రైలు విస్తరణ చేపడుతానని అన్నారు. మూసీ ప్రక్షాళన,జీవో నెం.118 పట్టాలు పరిష్కారిస్తానని, సునీతామన్ము మాత్రం 30 వేల ఓట్లతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి , టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కీ గౌడ్, టిపిసిసి ప్రతినిధి జక్కడి ప్రభాకర్‌రెడ్డి , రాంమోహన్ గౌడ్ , టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News