Thursday, May 23, 2024

వరుణ్ గాంధీకి బిజెపి టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే…

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని పిలిభిత్ లోక్ సభ టికెట్ ను వరుణ్ గాంధీకి బిజెపి ఇవ్వకపోవడంపై మేనకా గాంధీ నోరు విప్పారు. వరుణ్ గాంధీ రచనల వల్లే టికెట్ ఇవ్వలేదన్నారు. ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి వరుణ్ గాంధీకి ఎలాంటి టికెట్ అక్కరలేదని కూడా ఆమె అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ లోక్ సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న  మేనకా గాంధీ శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘నా తరఫున సుల్తాన్ పూర్ లో ఎన్నికల ప్రచారం చేయాలని వరుణ్ గాంధీ భావిస్తున్నారు. కానీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అన్నారు.

అయోధ్య రామ మందిరం సుల్తాన్ పూర్ కు దగ్గరలోనే ఉన్నప్పటికీ పెద్దగా ప్రాధాన్యత ఉందని అన్నారు. ‘‘ ఎన్ డిఏ కూటమికి 400పైగా సీట్లు, బిజెపికి 370కి పైగా సీట్లు దక్కుతాయా?’’ అని అడిగిన ప్రశ్నకు ‘‘అలాగే జరుగుతుందేమో…లేకుంటే వారెందుకలా అంటారు’’ అని వ్యాఖ్యానించారు. మేనకా గాంధీ పోటీ చేస్తున్న సుల్తాన్ పూర్ సీటుకు మే 25న పోలింగ్ జరుగబోతున్నది. ఆమె పై సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ బుల్ నిషాద్ పోటీ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News