Saturday, July 27, 2024

జెలెన్‌స్కీ హత్యకు కుట్ర?

- Advertisement -
- Advertisement -

కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ సంఘటనతో తన వ్యక్తిగత రక్షణను పర్యవేక్షించే విభాగాధిపతి (బాడీ గార్డ్ చీఫ్)పై అధ్యక్షుడు వేటు వేశారు.

ఈమేరకు విడుదల చేసిన ప్రకటనలో స్టేట్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ అధిపతి సెర్గియ్ లియోనిడోవిచ్ రుడ్‌ను తొలగించినట్టు వెల్లడించారు. అయితే ఆయనను తప్పించడానికి గల కారణాలను మాత్రం బయటపెట్టలేదు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం వెలుగు లోకి వచ్చిన ఈ కుట్రకు సంబంధించి స్టేట్ గార్డ్ విభాగానికి చెందిన ఇద్దరు కర్నల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు.

రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ పన్నిన హత్యాప్రణాళిక అమలులో వారిది అనుమానాస్పద పాత్ర ఉన్నట్టు ఉక్రెయిన్ తెలిపింది. గతంలో కూడా జెలెన్‌స్కీ అంతానికి రష్యా పలుమార్లు కుట్ర పన్నినట్టు పేర్కొంది. మరోపక్క పుతిన్ ప్రభుత్వం తన వాంటెడ్ లిస్ట్‌లో జెలెన్‌స్కీ పేరును చేర్చింది. అయితే నేరాభియోగాలు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. ఆయన పేరు కొన్ని నెలలుగా జాబితాలో ఉన్నప్పటికీ ఆ సంగతి ఇప్పుడే వెలుగులోకి వచ్చిందని ఇటీవల రష్యా మీడియాలో వార్తలొచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News