Saturday, July 27, 2024

పాక్ అణు బాంబు కొనేవారే లేరు

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ వద్ద అణు బాంబు ఉందన్న కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆక్షేపించారు. జనాన్ని భయపెట్టేందుకు కాంగ్రెస్ మార్గాలను అన్వేషిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థపై కూడా ఆయన విమర్శలు చేశారు. ‘ఆ దేశం వద్ద అణు బాంబులు ఉన్నాయి’, వాటిని అమ్మేందుకు చూస్తోందని, కానీ వాటి నాసి రకం నాణ్యత కారణంగా ఆ పని చేయలేకపోతోందని ఆయన ఆరోపించారు. భారత్ పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని, తన సైనిక సత్తా ప్రదర్శించరాదని, అలా చేస్తే ఇస్లామాబాద్ ఢిల్లీపై అణ్వాయుధాలు ప్రయోగించవచ్చునని అయ్యర్ ఇప్పుడు వైరల్ అయిన ఒక పాత ఇంటర్వూలో సూచించి కొత్త వివాదం సృష్టించారు. ప్రధాని మోడీ ఒడిశా కందమాల్‌లో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ, ‘కాంగ్రెస్ పదే పదే సొంత దేశాన్నే భయపెట్టే ప్రయత్నం చేస్తోంది.“సంభాల్ కే చలో పాకిస్తాన్ కే పాస్ ఆటమ్ బాంబ్ హైఁ. యే మేరే పడే లోగ్. దేశ్ కే మన్ కో భీ మార్ రహే హైఁ’ అని వారు అంటున్నారు.

(గమనించండని వారు అంటున్నారు. పాకిస్తాన్ వద్ద అణు బాంబు ఉంది. మన దేశంపై దాడి చేయడం గురించి వారు మాట్లాడుతున్నారు)’ అని ఆరోపించారు. ‘వారు పాకిస్తాన్ బాంబు గురించి మాట్లాడతారు. కాని పాకిస్తాన్ పరిస్థితి ఎటువంటిది అంటే దానిని ఎలా నిర్వహించాలో వారికి తెలియదు. తమ బాంబులు విక్రయించేందుకు కొనుగోలుదారు కోసం వారు చూస్తున్నారు. కాని నాణ్యత గురించి జనానికి తెలుసు కనుక వాటిని కొనాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు’ అని మోడీ చెప్పారు. ప్రభుత్వం కావాలనుకుంటే ఇస్లామాబాద్‌తో కఠిన స్వరంతో మాట్లాడవచ్చు అని, కానీ పొరుగు దేశాన్ని గౌరవించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవలసి రావచ్చు’ అని ఆయ్యర్ ఆ ఇంటర్వూలో అన్నారు. ‘వారి వద్ద అణు బాంబులు ఉన్నాయి. మన వద్దా అవి ఉన్నాయి. కానీ ‘ఒక పిచ్చివాడు’ లాహోర్‌పై బాంబు వేయాలని నిర్ణయించుకుంటే ఆ రేడియేషన్ అమృత్‌సర్ చేరడానికి ఎనిమిది సెకన్లు కూడా పట్టదు.

మనం వారిని గౌరవిస్తే వారు ప్రశాంతంగా ఉంటారు. కాని వారిని మనం కెలికితే, ‘ఒక పిచ్చివాడు’ వచ్చి (భారత్‌పై) బాంబులు వేయాలని నిర్ణయిస్తే ఏమి జరుగుతుంది?’ అని అయ్యర్ అన్నారు. అయ్యర్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ వెంటనే స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News