Tuesday, April 30, 2024

హిమాచల్ సిఎంగా సుఖ్వీందర్ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్‌సింగ్ సుఖు ఆదివారం ప్రమాణ స్వీ కారం చేశారు. ముఖ్యమంత్రిగా సుఖ్విందర్, ఉప ముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత్రిల ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సి మ్లాలోని రిడ్జ్ మైదానంలో జరిగిన ప్రమాణ స్వీ కార కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమం త్రి చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.

కాగా కొత్తగా ఎన్నికయిన నేతలు ప్రమాణ స్వీ కారం చేసిన వెంటనే వేదికపై ఆరుసార్లు రాష్ట్రాన్ని పాలించిన రాజవంశీకుడు వీరభద్ర సింగ్‌కు ఘ నంగా నివాళులర్పించారు. మాజీ కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లోట్, భూపేశ్ బాఘెల్, హర్యా నా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూ డా, రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్, హిమాచల్‌ప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ తదితరులు, సుఖ్విందర్ కుటుంబ సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు సుఖ్విందర్ సింగ్ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇంటినుంచి బయలుదేరుతూ తల్లికి పాదాభివందనం చేశారు. ఆమె తన కొడుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పరిపాలన సాగించాలని ఆశీర్వదించారు. అనంత రం ఆయన హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభాసింగ్‌ను ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. తన ప్ర మాణ స్వీకార కార్యక్రమానికి రావలసిందిగా స్వయంగా ఆహ్వానించారు. ఇటీవల జరిగిన హి మాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి ప్రతి భా సింగ్ పేరు బలంగా వినిపించినప్పటికీ పార్టీ అధిష్ఠానం మాత్రం సుఖ్విందర్ సింగ్ వైపు మొ గ్గు చూపింది.

ముఖ్యమంత్రి పదవిని ఆశించిన మరో నేత అగ్నిహోత్రిని ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి సంతృప్తిపరిచింది. సుఖ్విందర్ సింగ్ గత రెండు దశాబ్దాలుగా నాదౌన్ నియోజక వర్గంనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో హి మాచల్‌ప్రదేశ్ పిసిసి చీఫ్‌గా కూడా పని చేశారు. నాలుగు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచిన సుఖ్విందర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభా గం ఎన్‌ఎస్‌యు నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పార్టీకి కొత్త జవసత్వాలు చేకూరాయని హూడా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News