Monday, April 29, 2024

ఆకస్మిక వరదలకు మూసుకుపోయిన కులూ రహదారి

- Advertisement -
- Advertisement -

సిమ్లా, మండి: భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు రావడంతోపాటు కొండ చరియలు విరిగిపడడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని పండో-కులూ రహదారిపైని అవుత్ సమీపంలోనిల్నాలా వద్ద ఆదివారం సాయంత్రం నుంచి వందలాది వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు పునరుద్ధరణ పనులు చురుకుగా సాగుతున్నాయని, రోడ్డుపై పడిఉన్న భారీసైజు రాళ్లను పగలగొట్టడానికి పులుడు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు మండి పాలనా మంత్రాంగానికి చెందిన అధికారులు సోమవారం తెలిపారు. చండీగఢ్ నుంచి మనాలీని కలిపే 21వ నంబర్ జాతీయ రహదారిపైన వాహనాల రాకపోకలను పునరుద్ధరించడానికి మరో ఏడు, ఎనిమిది గంటలు పడుతుందని అధికారులు వివరించారు.

రోడ్డు తిరిగి తెరిచేవరకు మండి వైపు వాహనదారులు ఎవరూ వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. ట్రాఫిక్ జామ్‌లో ఆదివారం సాయంత్రం నుంచి చిక్కుకుని ఉన్నామని, అవుత్ వద్ద ఆరు మైళ్ల వరకు రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయని చండీగఢ్ నుంచి మండి వెళుతున్న ప్రశాంత్ అనే వాహనదారుడు తెలియచేశారు.

కంగ్ర, మండి, సిర్మూర్ జిల్లాలలోని అనేక ప్రాంతాలలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ధర్మశాల, కటూల, గోహర్, మండి, పంటా సాహిబ్, పలంపూర్‌లో భారీ వర్షాలు పడ్డాయి. జూన్ 27చ 28 తేదీలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News