Saturday, May 4, 2024

బిఆర్ ఎస్ సభతో దేశ రాజకీయాల్లో పెను మార్పులు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం లో జరిగిన బి ఆర్ యస్ సభతో దేశరాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన సూర్యాపేట లో మీడియా తో మాట్లాడారు. సరికొత్త పంథాలో ముఖ్యమంత్రికెసిఆర్  హస్తినకు అడుగులు వేస్తున్నారని ఆ అడుగులు 2024 లో సరికొత్త శకానికి నాంది పడబోతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్,బిజెపి ల ఎలుబడిలో దేశం గాఢాందాకారంలోకి నెట్టి వెయ్యబడిందని ఆయన ఆరోపించారు. అటువంటి గడ్డు పరిస్థితులనుండి దేశాన్ని బయట పడేసేందుకే బి ఆర్ యస్ ఆవిర్భావించిందని ఆయన స్పష్టం చేశారు.అందుకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం సభ సక్సెస్ తో అది నిరూపితమైందని ఆయన చెప్పారు.
దేశంలో అలుముకున్న చీకట్లను తొలగించాలి అన్నది ముఖ్యమంత్రికెసిఆర్సంకల్పం అన్నారు.

అందుకే బి ఆర్ యస్ తో హస్తినకు పయనం కట్టారన్నారు. ఇప్పటికీ దేశంలో 35 శాతానికి పై బడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. అటువంటి పరిస్థితుల నుండి అధిగమించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ యస్ కు దేశ ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం లో జరిగిన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News