Saturday, January 28, 2023

తెలంగాణ ప్రభుత్వ పథకాలు అద్భుతం. .తమిళనాడు ఎమ్మెల్యేలు

- Advertisement -

 

తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అధ్బుతంగా ఉన్నాయని తమిళనాడు ఎమ్మెల్యేల బృందం మంత్రి గంగులను అభినందించారు. తెలంగాణ లో ప్రభుత్వం చేపడుతున్న దళితబందు , ఎస్సీ సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన కోసం కరీంనగర్ విచ్చేసిన తమిళనాడు ఎమ్మేల్యేలు నగరంలో మంత్రి గంగుల కమలాకర్ కలిసారు.

ఈ సందర్భంగా దళిత బంధు ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివరాలను మంత్రి ఎమ్మెల్యేలకు వివరించారు. దళిత బంధు గురించి సంపుర్ణ సమాచారాన్ని తెలుసుకున్న ఎమ్మేల్యేలు దళిత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కెసిఆర్ ని ప్రశంసించారు. దళిత బంధు తో పాటు తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలు అధ్బుతంగా ఉన్నాయని మంత్రిని అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles