Tuesday, June 17, 2025

అఫ్రిది కుమార్తెతో షాహిన్ అఫ్రిది వివాహం..

- Advertisement -
- Advertisement -

కరాచీ: పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది వివాహం శుక్రవారం మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాతో ఘనంగా జరిగింది. పాక్ కెప్టెన్ బాబర్‌తోపాటు క్రికెటర్లు వీరి వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. షాహిన్, అన్హా నిశ్చితార్థం గతేడాది జరిగింది.

Shaheen Afridi married Afridi's daughter Ansha

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)ఫ్రాంఛైజీ కలందర్స్ ట్విట్టర్‌లో షాహిన్ వివాహ ఫొటోలను అభిమానులకు షేర్ చేసింది. కెప్టెన్ బాబర్‌తోపాటు సర్ఫరాజ్ ఖాన్, షాదాబ్ ఖాన్, నసీంషా తదితరులు వివాహానికి హాజరైనవారిలో ఉన్నారు. కాగా గతేడాది ప్రపంచకప్ ఫైనల్లో మోకాలి గాయంతో వైదొలిగిన షాహిన్ పిఎస్‌ఎల్ లీగ్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో నెట్స్‌లో శ్రమిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News