Friday, March 29, 2024

అమరీందర్ భార్య కౌర్‌పై కాంగ్రెస్ వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పంజాబ్‌లోని పాటియాలా ఎంపి ప్రణీత్ కౌర్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణా సంఘం శుక్రవారం తమ నిర్ణయాన్ని వెలువరించింది. పార్టీ నుంచి ఎందుకు వెలివేయరాదో తెలియచేసుకోవాలని కమిటీ ఆమెకు షోకాజ్ నోటీసు వెలువరించింది. మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన ప్రణీత్ కౌర్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య.

పంజాబ్‌లో ఆమె వ్యవహార శైలి అంతా కూడా బిజెపికి సహకరించేదిగా ఉందని, క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తోందని పంజాబ్ పిసిసి అధ్యక్షులు అమరీందర్ రాజా, ఇతర సీనియర్ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనితో ఆమెపై ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడిందని వెల్లడైంది. అమరీందర్ సింగ్ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరారు. కాంగ్రెస్ ఎంపి అయిన ప్రణీత్ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో చర్య తీసుకున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి , పార్టీ క్రమశిక్షణా కమిటీ సభ్య కార్యదర్శి అయిన తారీఖ్ అన్వర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News