Monday, August 18, 2025

వైభవంగా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో వారం కూడా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మల్లన్న దర్శనానికి క్యూలైన్ లో పెద్దఎత్తున్న భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఇక, ఆలయం వద్ద ఒగ్గుడోలు చప్పుల్లతో బోనాలు ఊరేగిస్తున్నారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, కళాకారుల నృత్యాలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భారీగా భక్తులు తరలివస్తుండడంతో జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News