Saturday, May 4, 2024

సిఎస్ శాంతి కుమారిపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి(సిఎస్) శాంతి కుమారిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పిటిషన్ దాఖలు చేయగా.. గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు.

గవర్నర్ మొత్తం పది బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన గవర్నర్ తమిళిసై.. సిఎస్ శాంతి కుమారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎస్ గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి శాంతి కుమారి మర్యాదపూర్వకంగా తనను కలువలేదు. అధికారింగా రాలేదు, ప్రోటోకాల్ లేదు. ఫోన్ లో కూడా మాట్లాడలేదు. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా ఉంది. రాజ్ భవన్ కు రావడానికి కనీసం టైమ్ కూడా లేదా? అంటూ ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News