Wednesday, December 4, 2024

మూడో టెస్టులో ఆసీస్ ఘన విజయం..

- Advertisement -
- Advertisement -

ఇండోర్: ఆతిథ్య టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించింది.
భారత్ విధించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు తొలి ఓవర్ లోనే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకిచ్చాడు. రెండో బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా(0)ను ఔట్ చేసి భారత్ బ్రేక్ అందించాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన లబూసేన్(28)తో కలిసి మరో ఓపెనర్ హెడ్(49) టీమిండియా స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన వీరిద్దరూ 18.5 ఓవర్లలో 78 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.దీంతో ఆసీస్, భారత్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, నాలుగు టెస్టుల సిరీస్ లో 2-1తో భారత్ ఆధిక్యంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News