Tuesday, April 30, 2024

హైదరాబాద్‌లో కోవిడ్‌ తర్వాత 95%కు చేరిన వీసా దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి వీసా దరఖాస్తుల సంఖ్య 2022లో దాదాపుగా కొవిడ్‌ ముందు కాలం నాటి స్ధాయిలకు చేరాయి. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దులు తెరవడం, కొవిడ్‌ సంబంధిత మార్గదర్శకాలను సరళీకృతం చేయడంతో డిమాండ్‌ పెరిగింది. వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ వెల్లడించే దాని ప్రకారం, హైదరాబాద్‌ నుంచి దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే 2019 కొవిడ్‌ ముందస్తు నాటి దరఖాస్తులలో 95%కు 2022లో చేరుకుంది. అంతేకాదు 2021తో పోలిస్తే ఏకంగా 129% వృద్ధి కనిపించింది.

‘‘భారతదేశం నుంచి 2022లో మేము అసాధారణ డిమాండ్‌ను చూశాము. అసాధారణ ఔట్‌బౌండ్‌ ట్రావెల్‌ సీజన్‌గా ఇది నిలవడంతో పాటుగా డిసెంబర్‌ నెల వరకూ కూడా స్ధిరంగా దరఖాస్తులను చూస్తూనే ఉన్నాము. ఈ వేగం మరింతగా పెరగనుందని మేము ఆశిస్తున్నాము. అందువల్ల, వీసా దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ముందుగానే పెట్టవలసనదిగా సూచిస్తున్నాము. తద్వారా చివరి నిమిషంలో ఊహాతీత సంఘటనలను అధిగమించవచ్చు’’ అని ప్రబుద్ధ సేన్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సౌత్‌ ఆసియా), వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ అన్నారు.

యాత్రికుల ప్రవర్తన పరంగా కనుగొనబడిన మరో ట్రెండింగ్‌ ధోరణి అంటే మాత్రం వ్యక్తిగతీకరించిన సేవలు. మహమ్మారి ప్రారంభం నుంచి ఈ సేవలను ఎక్కువ మంది కోరుతున్నారు. ప్రీమియం ఆప్షనల్‌ సేవలు అయినటువంటి వీసా ఎట్‌ డోర్‌ స్టెప్‌ (వీఏటీడీ) వంటివి యాత్రికులు తమ వీసా అనుభవాల ను తాము కోరుకునే ప్రాంతాలలో పొందే అవకాశం కల్పిస్తుంది. ఈ సేవలకు 2022 లో రెండు రెట్ల వృద్ధి కనిపించింది. భారతదేశంలో ఆస్ట్రియా, చెక్‌ రిపబ్లిక్‌, డెన్మార్క్‌, ఈస్ట్రోనియా, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, హంగేరీ, ఐస్‌ల్యాండ్‌, ఇటలీ, లథయానియ, లగ్జంబర్గ్‌, స్లోవేనియా,స్విట్జర్లాంగ్‌, యుకె వంటి 16 క్లయింట్‌ గవర్నమెంట్స్‌ వైఏటీడీని వీఎఫ్‌ఎస్‌ అందిస్తుంది.

‘‘నూతన సాధారణతలో ఆరోగ్య పరిగణనలు కీలక నిర్ణయాత్మక అంశాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఫలితంగానే, అధిక సంఖ్యలో యాత్రికులు ఈ తరహా సేవలను కోరుకుంటుండటం కనిపిస్తుంది. ఇవి సౌకర్యవంతమైన వీసా అనుభవాలను అందించడంతో పాటుగా సురక్షితమైన ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తున్నాయి’’ అని సేన్‌ అన్నారు.

పీక్‌ సీజన్‌ ట్రావెల్‌ గైడ్‌

ఫ్లైట్‌ బుకింగ్‌ మరియు వసతి బుక్‌ చేసుకున్నంత త్వరగా వీసాల కోసం దరఖాస్తు చేయడానికి సూచించడమైనది. అధిక శాతం దేశాలు మీ ప్రయాణ తేదీకి మూడు నెలలు (90 రోజుల) ముందుగానే వీసా దరఖాస్తులను అంగీకరిస్తుంటాయి. సవరించిన షెన్‌జెన్‌ వీసా కోడ్‌ ప్రకారం, 09 ఫిబ్రవరి 2020నుంచి, మీరు షెన్‌జెన్‌ వీసాల కోసం మీ ప్రయాణతేదీకి ఆరు నెలల ముందుగానే దరఖాస్తు చేయవచ్చు. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం, డిమాండ్‌ అధికంగా ఉండటంతో పాటుగా పరిమిత స్లాట్స్‌ లభ్యత ఉండటం చేత వీలైనంత త్వరగా దరఖాస్తుదారులు దరఖాస్తు చేయాల్సిందిగా సూచిస్తున్నాము.

మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి

అపాయింట్‌మెంట్‌ల షెడ్యూలింగ్‌ లేదంటే వీఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ యొక్క పేరు ఉపయోగించి లేదంటే స్వతంత్య్రంగా మరేదైనా సేవలనందిస్తామంటూ వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసే మోసపూరిత సంస్థల పట్ల ఆప్రమప్తంగా ఉండాల్సిందిగా వీసా దరఖాస్తుదారులకు సూచించడమైనది. అపాయింట్‌మెంట్స్‌ షెడ్యూలింగ్‌ కోసం మేము ఎలాంటి ఫీజునూ వసూలు చేయము. మరేదైనా సహాయం కావాల్సి వస్తే, మీరు మా సిబ్బందితో మాట్లాడటం లేదా ఛిౌఝఝఠుఽజీఛ్చ్టిజీౌుఽటఃఠిజటజజూౌఛ్చజూ.ఛిౌఝ కు ఈ–మెయిల్‌ చేయడం చేయవచ్చు.

సౌకర్యవంతమైన వీసా సేవల కోసం మా ఆప్షనల్‌ విలువ ఆధారిత సేవలను ఆస్వాదించవచ్చు :

 ప్రీమియం లాంజ్‌లు: వేగం, సురక్షితం, సౌకర్యవంతం– వ్యక్తిగతీకరించిన వీసా సమర్పణ అనుభవాలను పొందవచ్చు.
ఫార్మ్‌ ఫిల్లింగ్‌ సహాయం: మా అనుభవజ్ఞులైన సిబ్బంది, మీ వీసా దరఖాస్తును ఫోన్‌ లేదా వీసా దరఖాస్తు కేంద్రం వద్ద పూర్తి చేయడంలో సహాయపడతారు.
 కొరియర్‌ సర్వీస్‌: మేము మీ పాస్‌పోర్ట్‌ మరియు డాక్యుమెంట్లను డెలివరీ చేస్తాము. ఇది వేగవంతం, సురక్షితం, సౌకర్యవంతమైనది.
ట్రావెల్‌ మెడికల్‌ ఇన్సూరెన్స్‌: మీ తప్పనిసరి ట్రావెల్‌ వైద్య భీమాను కొవిడ్‌–19 కవరేజీతో సహా అంతర్జాతీయ భీమా సంస్ధల నుంచి పొందండి.
 ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌: మీ వీసా దరఖాస్తు పురోగతి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News