Saturday, April 20, 2024

మంత్రులు, ఎంఎల్‌ఎలు చొరవ చూపాలి: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని ఆర్థిక వైద్యారోగ్య మంత్రి టి.హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీలపై నిమ్స్ నుంచి మంత్రి జూమ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనతో గతేడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి రికార్డు కొట్టగా, ఈ ఏడాది జనగాం, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు.

మెడికల్ కాలేజీల పనులు వేగంగా జరిగేందుకు సంబంధిత జిల్లా మంత్రులు, ఎంఎల్‌ఎలు చొరవ చూపాలని మంత్రి అన్నారు. జిల్లా కలెక్టర్లు, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఇంజినీర్లు నిత్య సమీక్షలు చేసుకుంటూ పనులు చేయాలన్నారు. ఈ మెడికల్ కాలేజీలకు అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్‌మెంట్ సరఫరా పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. జూలై నుంచి తరగతులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది కాబట్టి, విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన హాస్టల్స్ వసతి విద్యార్థులు, విద్యార్థినులకు వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గొప్ప ఆలోచనతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు తరగతులు ప్రారంభించే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు పూర్తి అయ్యేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News