Friday, April 26, 2024

ఏప్రిల్ 3 నుంచి గ్రూప్-1 శిక్షణా తరగతులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రూప్-1 కోచింగ్ ప్రోగ్రామ్ కోసం హైదరాబాద్‌లోని ఓయూ సెంటర్‌లో తాజా బ్యాచ్ శిక్షణా తరగతులు ఏప్రిల్ 3 నుండి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ, ఇంటర్మీడియట్ లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 200 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం గతంలో మెయిన్స్‌కు అర్హత సాధించిన, మెయిన్స్ ఉత్తీర్ణత సాధించని అభ్యర్థుల నుండి తెలంగాణ బిసి స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానించింది. మధ్యాహ్నం భోజనం బిసి స్టడీ సర్కిల్‌లో ఏర్పాటు చేయబడుతుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె. అలోక్ కుమార్ తెలిపారు.

అభ్యర్థి తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.5 లక్షలకు లోపు ఉన్నవారు అర్హులని తెలిపారు. ఇంతకు ముందు మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించని టిఎస్‌పిఎస్‌సి గ్రూప్1 కి వెయిటేజీ, ఉన్నత విద్యార్హతలకు 10 శాతం మార్కులు, డిగ్రీ మార్కులకు 50 శాతం, ఇంటర్మీడియట్ మార్కులకు 20 శాతం మార్కులు ఇవ్వబడుతాయన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలతో పాటు విద్యార్హత ధృవీకరణ పత్రాలతో నేరుగా బిసి స్టడీ సర్కిల్ ఓయూ క్యాంపస్‌లో ఈ నెల 31 లోగా సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 04024071178, 04027077929 ను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News