Tuesday, September 16, 2025

‘దహీ’ ఆదేశం వాపస్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) ‘కర్డ్’ అన్న ఇంగ్లీషు పదాన్ని వాడొచ్చు, అలాగే ప్రాంతీయ భాషా పదాన్ని వాడొచ్చని తెలుపుతూ ప్రావిజన్స్‌ను జారీ చేసింది. ఇదివరలో ‘కర్డ్’ అన్న పదం వాడొద్దని, ‘దహీ’ అన్న హిందీ పదమే వాడాలని జారీచేసిన ఆదేశాన్ని వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదలచేసింది. దీంతో హిందీ దురభిమానులు ఒక మెట్టు దిగొచ్చారని తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News