Friday, April 26, 2024

డేటా చోరీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా డేటా చోరీ కేసు సంచలనంగా మారింది. అయితే తాజాగా డేటా చోరీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది. కాగా, దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును ఛేదించిన సైబరాబాద్ పోలీసులు వ్యక్తిగత డేటాను విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 16.8 కోట్ల మంది డేటా చోరీకి గురైనట్లు తేలింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై కేసు దర్యాప్తు కోసం ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది.

రక్షణ రంగ అధికారుల కీలక సమాచారం చోరీ అయినట్లు దర్యాప్తులో తెలింది. డేటా చోరీ కేసు దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. డేటా చౌర్యం కుంభకోణంలో పలు బ్యాంకుల క్రెడిట్ కార్డు జారీ చేసే ఏజెన్సీ ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో బీమా, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News