Monday, May 6, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లు తిరస్కరణ

రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్‌ విచారణ 29కి వాయిదా

పోలీసుల వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్:  ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్లపై పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై అంతకు ముందు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్పందించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ సాగుతోందన్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. ఈ కేసులో చాలామంది ప్రమేయం ఉందని తెలుస్తోందన్నారు. ప్రభాకర్ రావును పట్టుకోలేదనేది అవాస్తవమన్నారు. దర్యాఫ్తు అధికారులకు ప్రభాకర్ రావు అందుబాటులోకి రాలేదన్నారు. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలను వెల్లడిస్తామన్నారు.

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News