Thursday, May 2, 2024

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -
Traffic Restrictions in Hyderabad
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఆంక్షలు విధించిన పోలీసులు

హైదరాబాద్: నగరంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అనిల్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. ర్యాలీకి వచ్చే వారు తమ వాహనాలను చార్మినార్ బస్ టెర్మినల్‌లో పార్కింగ్ చేయాలి.

చార్మినార్ వైపు వచ్చే వాహనాలను షాలిబండ ఎక్స్ రోడ్డు వద్ద మళ్లించి కిలావత్ లేదా నగుల చింత లేదా మొఘల్‌పుర వైపు మళ్లించారు. చార్మినార్, మోతిగల్లి వైపు వాహనాలను అనుమతించరు, మూసాబౌలి లేదా ఓల్గా హోటల్ వైపు మళ్లిస్తారు.
గుల్జార్ హౌస్ వైపు వాహనాలను అనుమతించరు, మట్టీకా షేర్ లేదా పంజేషా వైపు మళ్లిస్తారు.  గుల్జార్ హౌస్, మిట్టీ కా షేర్ వైపు వాహనాలను అనుమతించరు, కిలావత్ లేదా ఘన్సీ బజార్ వైపు మళ్లిస్తారు. గుల్జార్‌హౌస్ నుంచి వచ్చే వాహనాలను మదీన వైపు నుంచి చార్మినార్ వైపు అనుమతించరు. సిటీ కాలేజీ వద్ద వాహనాలను మళ్లిస్తారు. సిటీ కాలేజి వచ్చే వాహనాలను ఢిల్లీ గేట్ వైపు అనుమతించరు, బేగంబజార్,మూసాబౌలి వైపు మళ్లిస్తారు. ఆఫ్జల్‌గంజ్ నుంచి వచ్చే నయాపూల్ వైపు వచ్చే వాహనాలను శివాజి బ్రిడ్జి, ఎంజే బ్రిడ్జి వైపు మళ్లిస్తారు. ఎస్‌జె రోటరీ నుంచి వచ్చే వాహనాలను శివాజి బ్రిడ్జి, మీర్ అలాం మండివైపు మళ్లిస్తారు. ర్యాలీ దారుల్ షఫాకు చేరుకోగానే వాహనాలను దబీర్‌పుర ఎపిఎటి మీదు మళ్లించి మాతాకిడికి మీదుగా మళ్లిస్తారు.

ర్యాలీ ఎపిఎటి వరకు రాగానే వాహనాలను దబీర్‌పుర లేదా మాతా కిడికి వైపు వాహనాలను అనుమతించరు. పురాణాహవేలి నుంచి వచ్చే వాహనాలను దబీర్‌పుర లేదా మాతాకిడికి వైపు మళ్లిస్తారు. ర్యాలీ ఎపిఎటి వరకు రాగానే టిప్పు ఖాన్ జంక్షన్ వయా చట్టాబజార్ వైపు నుంచి వచ్చే వాహనాలను పురాని హవేలి లేదా పీల్‌గేట్ వైపు అనుమతించరు. మదీన, టిప్పు ఖానా జంక్షన్‌వైపు మళ్లిస్తారు. ఎపిఎటి వరకు ర్యాలీ రాగానే ఎటబార్ చౌక్ వైపు ట్రాఫిక్ అనుమతించరు. పురాని హవేలి వైపు అనుమతించరు, పంజేషా లేదా యాకత్‌పుర వైపు మళ్లిస్తారు. ర్యాలీ ఎటాబార్ చౌక్‌కు రాగానే ట్రాఫిక్ బిబి బజార్ వాహనాలను మీరాలం మండి వాహనాలను తలాబ్ కట్ట లేదా హఫీజ్ దన్‌కా మసీద్ వైపు మళ్లిస్తారు. ర్యాలీ కోట్లా అలీజా రాగానే వోల్టా హోటల్ నుంచి వాహనాలను తలాబ్‌కట్టవైపు మళ్లిస్తారు.  ర్యాలీ ఓల్టా హోటల్, మొఘల్‌పురాకు రాగానే హరిబౌలి వైపు వాహనాలను అనుమతించరు. షాఅలీ బండా ఎక్స్‌రోడ్డు లేదా సుల్తాన్ షాహి వైపు మళ్లిస్తారు. ఆర్టిసి బస్సులు చాంద్రాయణగుట్ట మీదుగా నల్గొండ ఎక్స్ రోడ్డు, రంగామహల్, ఎంజె మార్కెట్ మళ్లిస్తారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News