Monday, May 6, 2024

సూరత్ లోక్ సభ అభ్యర్థిని సస్పెండ్ చేసిన కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: సూరత్ లోక్ సభ అభ్యర్థి నిలేశ్ కుంభాని ని గుజరాత్ కాంగ్రెస్ శుక్రవారం పార్టీ నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. తేడాలుండడంతో ఆయన నామినేషన్ ఫామ్ తిరస్కరణకు గురయింది. దాంతో బిజెపి అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్చలు జరిపి కుంభాని ని సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ‘బిజెపి తో కుమ్మకయి ఆయన నిర్లక్ష్యంగా నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారని’ పేర్కొంది. ‘‘మీకు డిసిప్లనరీ కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరాము. కానీ మీరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మీ ఫామ్ ను అధికారులు తిరస్కరించారు. ఎనిమిది మంది అభ్యర్థులు కూడా తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దాంతో బిజెపి ముందుకు దూసుకుపోయింది. ఇది సూరత్ ప్రజల ఓటింగ్ హక్కును మోసగించినట్లయింది.’’ అని బాలు పటేల్ నేతృత్వంలి  కాంగ్రెస్ డిసిప్లనరీ కమిటీ పేర్కొంది.

‘‘ సూరత్ ప్రజలు, పార్టీ కార్యకర్తలు మీ చర్యవల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సయితం మిమ్మల్ని ఆరు నెలల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించింది’’ అని కాంగ్రెస్ ప్రెస్ నోట్ లో పేర్కొంది. కుంభాని నామినేషన్ ఏప్రిల్ 21న తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేశ్ పడ్సల నామినేషన్ కూడా అవే కారణాలతో తిరస్కరణకు గురయింది. ఇతర నామినీ అభ్యర్థులంతా తప్పుకోవడంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ సూరత్ లోక్ సభ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News