Tuesday, May 7, 2024

ఎసిబి వలలో ఇరిగేషన్ డిఈ

- Advertisement -
- Advertisement -

ఎన్‌ఓసి ఇచ్చేందుకు లంచం తీసుకుంటుండగా నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌ను ఎసిబి అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామంతపూర్‌కు చెందిన గోపగాని రమణమూర్తి ఉప్పల్‌లో వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఈ భవనానికి నీటిపారుదల శాఖ నుంచి ఎన్‌ఓసి తీసుకోవాలి. దాని కోసం బాధితుడు దరఖాస్తు చేశాడు, ఎన్‌ఓసి కోసం నీటిపారుదల శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యాత పవన్‌కుమార్‌ను సంప్రదించాడు.

ఎన్‌ఓసి ఇవ్వాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారి సూచనల మేరకు డిఈకి రూ.4లక్షలు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డిఈని అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు డిఈని రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News