Tuesday, May 21, 2024

IPL 2024: కమ్మిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

IPL 2024లో సన్ రైజర్స్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

ఓపెనర్ ట్రావిస్ హెడ (48) రాణించినా.. మిగతా బ్యాట్స్ మెన్లు మయాంక్ అగర్వాల్ (5), నితీశ్ రెడ్డి (20), హెన్రిచ్ క్లాసెన్ (2), అభిషేక్ శర్మ(11), ష‌హ్‌బాజ్ అహ్మద్(10), మార్కో జాన్‌సెన్(17)లు మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. దీంతో స్కోరు బోర్డు 150 పరుగుల మార్క్ కూడా దాటుతుందా? అనే క్రమంలో పాట్ కమ్మిన్స్( 17 బంతుల్లో 35 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ జట్టును ఆదుకున్నాడు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా మూడేసి వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News