Tuesday, May 7, 2024

బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బిజెపి విధానమని సిఎం ఆరోపించారు. ఆనాడు బ్రిటీషర్లు సూరత్ చేరుకుని క్రమంగా దేశమంతా ఆక్రమించుకున్నారని, ఇప్పుడు సూరత్ వ్యాపారులు దేశాన్ని ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బ్రిటీష్ వాల్ల వలే బిజెపి వాళ్లకు కూడా రిజర్వేషన్లు నచ్చవన్నారు. నేను ఉంటే తన కుట్రలు సాగవని కెసిఆర్, కెటిఆర్ భావిస్తున్నారని పేర్కొన్నారు.

బిజెపి, బిఆర్ఎస్ కుట్రలను ఎంపి ఎన్నికల్లో మరోసారి తిప్పికొట్టాలని ప్రజలను సిఎం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సైనికులు మరోసారి అవిశ్రాంతంగా పోరాడాలని రేవంత్ రెడ్డి కోరారు. కార్పొరేట్ కంపెనీల కుట్రలో భాగంగా రిజర్వేషన్లు రద్దు చేయాలని బిజెపి భావిస్తోందన్నారు. ఇప్పటికే రూ. 60లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలను మోడీ అమ్మేశారని ఆయన ఆరోపించారు. 13 మంది ప్రధానులు చేసిన అప్పుకంటే రెట్టింపు అప్పు నరేంద్ర మోడీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత అప్పు ఎందుకు చేశారని అడిగితే ‘అయోధ్యలో గుడిలో కట్టానని అంటారు.. ‘జైశ్రీరామ్ అంటారు’ అని ఆయన వెల్లడించారు. కెసిఆర్ కూడా ఎందుకు ఇంత అప్పు చేశారని అడిగితే ‘జై తెలంగాణ’ అన్నారు అని గుర్తుచేశారు. ఇన్నాళ్లు బిజెపి వాళ్లు రాముడి ముసుగు వేసుకుని రాజకీయం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News