Sunday, May 19, 2024

ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు… ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై వస్తున్న విమర్శలను ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. తమని తాము రక్షించుకోవడం నుంచి ఏ ఒత్తిడీ ఆపలేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ పోరాటంలో ఒంటరిగా వెళ్లాల్సి వస్తే, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

“రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు. మాకు అప్పుడు ఎలాంటి రక్షణ లేదు. ఏ దేశమూ మాకు అండగా నిలవలేదు. మా విధ్వంసం కోరుకుంటున్న ప్రత్యర్థులను ఈరోజు మళ్లీ ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో ఏ నాయకుడు , ఎలాంటి ఒత్తిడి, ఏ అంతర్జాతీయ సంస్థ నిర్ణయమూ మమ్మల్ని మేం రక్షించుకోవడం నుంచి ఆపలేదు” అని తన మద్దతుదారును ఉద్దేశించి నెతన్యాహు ప్రసంగంలో పేర్కొన్నారు.

అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ యూనివర్శిటీల్లో గాజా యుద్ధానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలననూ నెతన్యాహు తప్పు బట్టారు. వాటిని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ వర్శిటీల్లో జరిగిన వివక్షాపూరిత ఘటనలతో పోల్చారు. అవి తాము కొనసాగిస్తున్న యుద్ధంపై నిరసనలు కావని, తమ ఉనికిని సవాల్ చేయడమేనని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒత్తిడీ తమ చేతులను బంధించలేదన్నారు. విజయం సాధించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ తీరును అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తప్పుబడుతున్నాయి. వీలైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నెతన్యాహు తాజా వ్యాఖ్యలు చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News