Wednesday, May 22, 2024

గాజా యుద్ధంలో భారత్ ఆయుధాలు!

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌కు ఆయుధాలు అమ్మరాదని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ ఏప్రిల్ 5న తీర్మానం చేసింది. ఈ తీర్మాన సమావేశానికి భారత దేశం గైర్హాజరైంది. పాలస్తీనా పైన ఫ్రాన్‌సిస్కా అల్బనెస్ తయారు చేసిన ‘అనాటమీ ఆఫ్ జెనోసైడ్’ అన్న ఐక్యరాజ్య సమితి ప్రత్యేక నివేదికలో గాజాపై ఇజ్రాయెల్ ఎలా మారణహోమానికి పాల్పడిందీ వివరంగా పేర్కొంది. ఈ నివేదిక వచ్చిన రెండు వారాలకు ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిటీపై తీర్మానం చేసింది. అంతర్జాతీయ న్యాయస్థానం మారణ హోమంపై జనవరిలో చేసిన ప్రాథమిక తీర్మానాలను గాజాపై చేసిన దాడిలో ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక నివేదిక గుర్తించింది. భారత్ ఇజ్రాయెల్ ప్రభుత్వాలు, వాటి ప్రైవేటు కంపెనీలు ఇజ్రాయెల్‌తో యధావిధిగా ఆయుధ వ్యాపారం కొనసాగిస్తూనే ఉన్నాయి.

భారత దేశానికి చెందిన ఏరో స్పేస్ సర్వీస్, ఇజ్రాయెల్‌కి చెందిన ఇజ్రాయెల్ ఏరో స్పేస్ పరిశ్రమ గత మార్చిలో భారత దేశంలో ప్రారంభించాయి. భారతీయ మధ్యతరహా ఉపరితల మిజైల్ విధానం మాత్రమే భారత అధికారిక తయారీ పరిశ్రమ. మధ్యతరహా ఉపరితల మిజైల్ విధానాన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండియా, భారత దేశానికి చెందిన డిఆర్‌డిఒ కలిసి 2017లో 1.6 బిలియన్ డాలర్ల ఒప్పందంతో అభివృద్ధి చేశాయి. ఇజ్రాయెల్‌లో ఇదే అతిపెద్ద రక్షణ రంగ ఒప్పందం అని ఇజ్రాయెల్ ఏరో స్పేస్ ఇండస్ట్రీ ఒక ప్రకటనలో ఆనాడే చెప్పింది. ‘భారత దేశం ప్రపంచంలోనే అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశం’ అని స్టాక్ హోవ్‌ు ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చి ఇన్‌స్టిట్యూషన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ అమ్మే ఆయుధాల్లో అత్యధికంగా, అంటే 37% ఒక్క భారత దేశమే దిగుమతి చేసుకుంటుందని పేర్కొంది.

ఎగుమతుల్లో ఇజ్రాయెల్‌కు 20హెర్మ్‌స్‌ని, 900 డ్రోన్లలను ఎల్బిట్ అడ్వాన్స్‌డ్ సిస్టవ్‌ు ద్వారా పంపినట్టు గడిచిన ఫిబ్రవరిలో నివేదించింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, ఇజ్రాయెల్ ఎల్బిట్ సిస్టంతో సంయుక్తంగా పని చేయాలని 2016లో ఒక నిర్ణయానికి వచ్చింది. రెండేళ్ళ తరువాత అదానీ ఎల్బిట్ సిస్టం హైదరాబాదులో డ్రోన్‌లు తయారీ సంస్థను ఏర్పాటు చేసి, అక్కడినుంచే వాటిని ఇజ్రాయెల్‌కు ఎగుమతి చేస్తోంది. నాలుగేళ్ళ తరువాత అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మరో ఇజ్రాయెల్ ఆయుధ పరిశ్రమ కంపెనీతో చేరి ప్రిసైస్ లెథల్ రిలైబుల్‌లో అత్యధిక షేర్లను కొనుగోలు చేసింది. ఇజ్రాయెల్ రక్షణశాఖ కోసం ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీ మారణాయుధాలను కొనుగోలు చేస్తుంది. ఒకప్పుడు ఇరాన్ షాకు ఆయుధాలు సరఫరా చేసే వ్యాపారి సమీ కాత్సవ్‌కు చెందిన ఎస్‌కే గ్రూపుకు ఇది అనుబంధ సంస్థ.

పుంజి ఎల్ లాయిడ్ రక్షా సిస్టం, ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీ భాగస్వాములు. దాన్ని అదానీ స్వాధీనం చేసుకున్నాక దాని పేరు కాస్తా ‘ప్రిసైస్ లెథల్ రిలైబుల్’గా మారింది.ఇది అసాల్ట్ రైఫిళ్ళు, మెషిన్ గన్‌లు, గ్రెనేడ్ లాంచర్లను తయారు చేసి భారత దేశానికి చెందినవిగా అమ్ముతుంది. ఇది భారత దేశంలో తొలి ప్రైవేటు ఆయుధ తయారీ సంస్థ. ఈ ఏడాది బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా కాన్ఫరెన్స్‌లో హెర్‌మస్ 900 ఎగుమతిదారులతో పాటు ఇజ్రాయెల్ రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టం తమ రక్షణ రంగ ప్రసార విధానాన్ని ప్రదర్శించింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ వంటి రాఫెల్ సిస్టం కూడా ఇజ్రాయెల్‌కు చెందిం ది. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టం రాఫెల్‌తో చేరి 2015లో భారత్ ఫోర్జ్ సొంతమైంది. ఇలా సంయుక్తంగా ఏర్పడిన కళ్యాణ్ రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టం భారత తొలి మిస్సైల్ తయారీ కంపెనీగా అవతరించింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ మిస్సైళ్ళ కొనుగోలుకు కళ్యాణ్ రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టంకు 287 కోట్ల రూపాయలను ఇచ్చింది.

ఇజ్రాయెల్ రక్షణ కంపెనీలు తమ ఆయుధాలను అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మడానికి ముందు వాటిని పాలస్తీనాలో పరీక్షిస్తాయి. ‘ద పాండా’ అనే మానవ రహిత బుల్డోజర్లను గాజాలో ప్రయోగిస్తున్నారని ఇజ్రాయెల్ న్యూస్ ఏజన్సీ హారెట్జ్ రాసింది. పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించడానికి డి9 బుల్డోజర్‌ను ఉపయోగిస్తారని హుప్రాఫిట్ రీసెర్చి సెంటర్ తెలిపింది. ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా, సిరియా భూభాగంలో ఇది వ్యాపారాన్ని తెరిచింది. గాజా లో ఉపయోగించే ఈ బుల్డోజర్లు ఇజ్రాయెల్ నిర్మించినవే. ఐఎఐలో ప్రసిద్ధి చెందిన ‘హిరాన్ టిపి డ్రోన్’ ఎక్కువ ప్రాణాలు తీసే డ్రోన్‌గా ప్రసిద్ధి చెందింది. జర్మనీకి చెందిన ఈ రకమైన రెండు డ్రోన్లు ఇప్పటికే పాలస్తీనాలో ఉన్నాయి.

వీటిని పాలస్తీనాలో ఉపయోగించడానికి ఉంచినవని ఆరోపిస్తూ నికరాగువా గత మార్చిలో జర్మనీపైన అంతర్జాతీయ కోర్టులో వేసిన కేసులో పేర్కొంది. గాజాలో మారణ హోమం సృష్టించాలని జర్మనీ కంకణం కట్టుకున్నదని నికరాగువా ఆరోపించింది. జర్మనీకి వ్యతిరేకంగా నికరాగువా చేసిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ న్యాయస్థానం ఆయుధాలను అమ్మేటప్పుడు మారణ హోమానికి దారి తీయకుండా చూడాలని గత ఏప్రిల్ 30న జర్మనీకి సూచించింది. దీంతో పాటు ఐరన్‌స్టింగ్ బాంబు కాంక్రీటు గోడలను కూడా బలంగా చీల్చుకుని వెళ్ళిపోతుంది. ఫిబ్రవరిలో జరిగిన సింగపూర్ ఎయిర్ షోలో దీన్ని ప్రదర్శించారు.ఈ కంపెనీ చెప్పినదాని ప్రకారం, 2021లో ఇజ్రాయెల్ జరిపిన పదకొండు రోజుల ‘ఆపరేషన్ గార్డియన్ ఆఫ్ వాల్స్’లో 67 మంది పిల్లలు సహా మొత్తం 256 మంది పాలస్తీనా పౌరులు మరణించారు.యుద్ధంలో దీన్నిప్పుడు పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. ఈ కంపెనీలు పాలస్తీనా సహా ప్రభుత్వం చేపట్టే హింసవల్లనే లాభాలు ఆర్జిస్తున్నాయి. తెల్ల ఫాస్పరస్ ఆయుధాలను ఈ ఎల్బిట్ కంపెనీ తయారు చేస్తోందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు 2012లో సమర్పించిన వార్షిక నివేదికలో పేర్కొంది.

గాజాలో స్వచ్ఛందంగా పని చేస్తున్న అమెరికన్ ఫ్రండ్స్ సర్వీస్ కమిటీ సమాచారాన్ని పరిశోధనాత్మకంగా సేకరిస్తుంది. ఈ నెల అక్టోబర్ నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడి సహా, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, ఎల్బిట్ సిస్టం, రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టం, ఎస్.కె గ్రూప్ జాబితాలో ఉన్న కంపెనీల గురించిన సమాచారం ఇందులో ఉంది. గత త్రైమాసికంలో ఎల్బిట్ సిస్టం ఆదాయం 1.6 బిలియన్ల డాలర్లు, అంతకు ముందు త్రైమాసికంతో పోల్చుకుంటే ఇది 7% ఎక్కువ. ఇజ్రాయెల్‌కు ఆయుధాలు అమ్మడం వల్ల ఎల్బిట్‌కు 12 శాతం లాభాలు వచ్చాయి.ఈ కంపెనీ స్థాపించినప్పటి నుంచి ఇది అత్యధిక వసూళ్ళని ఐఎఐ నివేదిక తెలిపింది. 2023 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు త్రైమాసికంలో దీనికి 1.4 బిలియన్లు లభించాయి. గడిచిన త్రైమాసికంలో దేశం యుద్ధంలో ఉండడం వల్ల, ఇజ్రాయెల్ ఏరో స్పేస్ ఇండస్ట్రీ ఆర్థిక నివేదిక 2023 చాలా బాగుందని, ఆ కంపెనీ సిఇఒ బోజాలెవి చెప్పారు. రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టవ్‌‌సు అమ్మకాలు 19% పెరగడం వల్ల 2022 గడిచిన త్రైమాసికంలో 1.2 బిలియన్ డాలర్ల అమ్మకాలు పెరిగాయి. ఐఎఐకి 18 బిలియన్ డాలర్లు, ఎల్బిట్ సిస్టంకు 17.8 బిలియన్ డాలర్లు, రాఫెల్‌కు 14 బిలియన్ డాలర్ల లాభాలు లభించాయి.

గాజాపై యుద్ధం, మారణహోమం సందర్భంలో వారి వ్యాపారం వెలిగిపోతోందంటే, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఇజ్రాయెల్ పాలస్తీనాను ఆక్రమించడం, పాలస్తీనాకు వ్యతిరేకంగా మానవహక్కులను ఉల్లంగించడమే అవుతుంది. ఆక్రమిత పాలస్తీనాలో ‘చట్టవ్యతిరేక నిర్ణయాలకు మద్దతు తెలపడం, కొనసాగించడమే’ దాని పని అని ఐఎఐపైన ముద్రపడింది. మానవులను చంపేసే డ్రోన్లను, ఇతర ఆయుధాలను తయారు చేయడం అంటే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడమే అవుతుంది. ఎల్బిట్ సిస్టవ్‌‌సు ఆయుధాలు, వాటి చెక్ పాయింట్లు పాలస్తీనాకు వ్యతిరేకంగా జరిగే ‘యుద్ధ నేరాలకు’ సాయపడడమేననే ముద్ర పడిది. డిఆర్‌డిఒ, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్‌ల ప్రతినిధులను వీటిపై ఇమెయిల్ ద్వారా వ్యాఖ్యానించమని అడిగాను. ‘భారత అంతరిక్ష కార్యక్రమాలు, దాని అవసరాల కోసం కళ్యాణి, రాఫెల్ అత్యాధునిక విధానాలతో సంయుక్తంగా పని చేయడానికి 2015 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నా దాని అస్తిత్వం ఎలాంటి ఎగుమతులతో ముడిపడి లేదు.

కళ్యాణి గ్రూపు అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ ఎగుమతి విధానాలకు కట్టుబడి ఉన్న సంస్థ’ అని పేర్కొన్నారు. దీనిపై ఎఇఎల్, డిఆర్‌డిఒ ప్రతినిధులు స్పందించలేదు. ఇజ్రాయెల్‌పైన ఆయుధ ఆంక్షలు విధిస్తూ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిటీ సమావేశానికి మీరెందుకు గైర్హాజరయ్యారని భారత ప్రతినిధిని అడిగితే, వారి నుంచి సమాధానం లేదు. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని, దానిపై అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన రూలింగ్ చాలా న్యాయమైందని పాలస్తీనాకు మిలిటరీ నిషేధిత సమన్వయ కర్త షిర్ హెవెర్ వ్యాఖ్యానించారు. ‘ఇజ్రాయెల్ సైన్యం ఆ ఆయుధాలను ఉపయోగించి ఏ అన్యాయాలకైతే పాల్పడుతోందో, ఇలాంటి ఇబ్బందులు తమకు ముందుగా తెలియదని భారత అధికారులు, భారత రక్షణ కంపెనీలు వాదించలేవు’ అని ఆయన అంటారు.

మూలం: మెహర్ ఆలీ
అనువాదం: రాఘవశర్మ
9493226180
(‘ద వైర్’ సౌజన్యంతో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News