Monday, May 27, 2024

గుజరాత్ లోని పాఠశాలలకు బెదిరింపులు

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: దేశ రాజధాని ఢిల్లీ లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంఘటన మరువక ముందే అలాంటి సంఘటనే మరోసారి వెలుగు చూసింది. సోమవారం ఉదయం గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో పలు సంఖ్యలో స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.

అప్రమత్తమైన యాజమాన్యాలు వెంటనే పోలీస్‌లకు సమాచారం ఇచ్చాయి. వెంటనే తనిఖీలు నిర్వహించగా, ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్ధాలను గుర్తించలేదని పోలీస్‌లు తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ బెదిరింపులు దేశం వెలుపల నుంచి వచ్చినట్టు గుర్తించామని క్రైమ్ బ్రాంచి డీసీపీ లావినా సిన్హా పేర్కొన్నారు.

గత బుధవారం ఢిల్లీ లోని 100కు పైగా పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గుజరాత్ పాఠశాలలకు వచ్చిన బెదిరింపు మెయిల్స్, రష్యన్ డొమైన్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఘటనకు కూడా ఇదే కారణమని సమాచారం. ఒకే వ్యక్తి నుంచి ఈ బెదిరింపులు వచ్చి ఉంటాయని పోలీస్‌లు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News