Monday, June 17, 2024

మోడీ మరోమారు సిఎం అయితే అంతాబాగు: నితీష్ కుమార్

- Advertisement -
- Advertisement -

పాట్నా సభలో నితీష్ కుమార్ మాటతడబాటు
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు ఇటీవలి కాలంలో మాటల తడబాటు, మరుపు ఎక్కువైనట్లుంది. ఆదివారం ఆయన మరోసారి ఇక్కడ మాటజారారు. నరేంద్ర మోడీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పి సభికులలో గందరగోళం రేకెత్తించారు. పాట్నాలో ఎన్‌డిఎ తరఫున జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన తన వాగ్థాటి క్రమంలో లోక్‌సభ ఎన్నికలలో ఈసారి భారీ స్థాయిలో 400కు పైగా సీట్లు రావాలని , ఇందుకు ప్రజల మద్దతు అవసరం అని పేర్కొంటూ మన మోడీ తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పడంతో ఇదేం ట్విస్టు అని సందేహాలు వ్యక్తం అయ్యాయి.

400 సీట్లు వచ్చి, మోడీ సిఎం అయితే దేశం, ఈ బీహార్ అంతా బాగుపడితీరుతుందనే వ్యాఖ్యలను వెంటనే వేదికపై ఉన్న వారు ఆయనకు గుర్తు చేశారు. దీనితో నితీష్ మాట సరిదిద్దుకున్నారు. మోడీ తిరిగి ప్రధాని కావాలని, బలీయ మెజార్టీ ప్రధాని కావాలని అనుకుంటున్నానని చెప్పారు. అయితే ఈ 73 ఏండ్ల నేత ఇటీవలే బీహార్‌లోనే ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్‌ను గెలిపించాలని, ఆయనకు ఓటేయాలని కోరడంతో లేని నేత ఎక్కడి నుంచి వస్తాడని పలువురు వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News