Monday, June 17, 2024

అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయి : స్వాతి మాలీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆప్ నేతలు తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. దీనివల్ల తనకు అత్యాచార, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబర్ ధ్రువ్ రాథీ తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసినప్పటి నుంచి బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. “ స్వతంత్ర జర్నలిస్టుల మని చెప్పుకొనే అతడి లాంటి వ్యక్తులు ఆప్ ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటు.

ప్రస్తుతం నేను అన్ని వైపుల నుంచి అసత్య ప్రచారాలు, తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్నాను” అని మాలీవాల్ ఆదివారం ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. తన ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేయడానికి పార్టీ నాయకత్వం ఈ విధంగా బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆమె అన్నారు. ధ్రువ్‌ను కలిసి తన వాదన వినిపిద్దామంటే , అతడు తన ఫోన్ కాల్స్‌కు స్పందించట్లేదన్నారు. పార్టీ యంత్రాంగం తనతో ప్రవర్తిస్తున్న తీరు మహిళల సమస్యలపై వారి వైఖరిని తెలియజేస్తుందన్నారు. తనకు వస్తున్న బెదిరింపులపై పోలీస్‌లు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News