Monday, June 17, 2024

చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధం..

- Advertisement -
- Advertisement -

దూకుడు తగ్గించిన తైవాన్ అధ్యక్షుడు
తైపీ : తైవాన్ నూతన అధ్యక్షుడు లాయ్ చింగ్‌తే బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ప్రసంగంలో చైనాపై విరుచుకుపడ్డారు. ఈ విషయం బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా ఆ ద్వీపదేశం చుట్టూ డ్రాగన్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో లాయ్ చింగ్ దూకుడు తగ్గించారు. చైనాతో కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు సిద్ధమేనన్నారు. ఆదివారం ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన, ఈ వ్యాఖ్యలు చేశారు..

“ ప్రాంతీయ స్థిరత్వం చాలా కీలకం. తైవాన్ జలసంధిలో అలజడులను అంతర్జాతీయ సమాజం అంగీకరించదు. ఈ నేపథ్యంలో చైనాతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పరస్పర అంగీకారంతో సంయుక్తంగా ఈ అంశాన్ని స్వీకరించాలని కోరుతున్నా” అని లాయ్ చింగ్ బీజింగ్‌కు పిలుపునిచ్చారు. ఇటీవల తైవాన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకిగా పేరొందిన లాయ్ చింగ్ తె విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సందర్భంగా తమను బెదిరించడం ఆపాలంటూ డ్రాగన్‌కు గట్టిగా చెప్పారు. దీంతో ఆగ్రహించిన చైనా, తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ నేపథ్యం లోనే దూకుడును తగ్గించిన లాయ్ చింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News