Monday, June 17, 2024

మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్: కాజల్

- Advertisement -
- Advertisement -

హీరోయిన్‌ల మధ్య కెరీర్ పరంగా చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఒక హీరోయిన్ ఛాన్స్‌ను మరో హీరోయిన్ ఎగరేసుకుపోయిన ఉదంతాలు కోకొల్లలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్‌ల మధ్య ఫ్రెండ్ షిప్ సాధ్యమా? అవుఠను. కచ్చితంగా కుదురుతుందని చెబుతోంది కాజల్. ఇండస్ట్రీలో తనకు సమంత, తమన్న బెస్ట్ ఫ్రెండ్స్ అంటోంది ఈ భామ. సమంతతో కలిసి బృందావనం సినిమా చేసింది కాజల్. అప్పటి నుంచి వీళ్లిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు.

ఇక తమన్న, కాజల్ ఒకేసారి కెరీర్ మొదలుపెట్టారు. పైగా ఇద్దరీ ముంబయే. అలా ఈ ఇద్దరు స్నేహితులయ్యారు. కొన్నేళ్లుగా తాము ముగ్గురం మంచి స్నేహితులమని చెబుతోంది కాజల్. తమ బిజీ షెడ్యూల్స్‌తో పెద్దగా కలుసుకోవడం కుదరదని, ఒకవేళ ముగ్గురం కలిస్తే మాత్రం మామూలుగా ఉండదని చెబుతోంది. ఎన్నో కబుర్లు చెప్పుకుంటామని, జ్ఞాపకాలు నెమరువేసుకుంటామని అంటోంది. అయితే తమ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చలు మాత్రం రావని అంటోంది. సినిమాలు తప్ప అన్నింటి గురించి వీళ్లు మాట్లాడుకుంటారంట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News