Monday, June 17, 2024

అతివేగం… మృత్యుపాశం..!!

- Advertisement -
- Advertisement -

ప్రమాదం వీడియోను పోస్టు చేసిన ఆర్టీసి ఎండి విసి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్:  రోడ్డు ప్రమాదంపై టిజిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ పెట్టిన వీడియోకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ స్కూటీపై రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ అదే రోడ్డుపై అతి వేగంగా వస్తున్న ఓ బైక్‌ను చూసి రోడ్డు నడి మధ్యలో ఆగింది. ఓవర్ స్పీడ్‌లో ఉన్న ఆ బైక్ రోడ్డు మధ్యలో ఉన్న స్కూటీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆ బైకర్ తో పాటు స్కూటీ నడిపే మహిళ కూడా దూరంగా వెళ్లి పడ్డారు. దీనిపై అతివేగం… మృత్యుపాశం!! అని సజ్జనార్ రాసుకొచ్చారు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆ వీడియోపై రోడ్డు మధ్యలో వచ్చి అలా ఆగిపోతే ఎలా సార్ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా బైక్ స్పీడ్‌లో ఉండటం స్పష్టంగా అర్ధం అవుతుంది, కానీ, ఈ యాక్సిడెంట్ కు మూల కారణం మాత్రం ఆ మహిళే అని మరో నెటిజన్ అన్నారు. ఇక మరో నెటిజన్ ఇది మహిళల తప్పు కాదు పూర్తిగా పురుషులదే ఈ విషయాలను చట్టాలు అంగీకరించవని కామెంట్ పెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News