Tuesday, October 22, 2024

మీ జుట్టు చిట్లిపోతోందా?..పెరుగుతో మెరిసే జుట్టు..

- Advertisement -
- Advertisement -

జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించుకోవడానికి, మహిళలు అనేక రకాల సౌందర్య సాధనాలు, ఖరీదైన జుట్టు సంరక్షణ చికిత్సలను ఆశ్రయిస్తారు. అయితే, ఈ చికిత్సలు అన్ని సమయాలలో తీసుకోవడం సరికాదు. ఎందుకంటే అవి ఖరీదైనవి. అలాగే పదేపదే హెయిర్ స్పా తీసుకోవడం వల్ల జుట్టు మరింత దెబ్బ తినే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో పెరుగు హెయిర్ స్పా క్రీమ్ తయారుచేసే విధానాన్నితెలుసుకుందాం. అయితే, జుట్టులో చుండ్రు సమస్యను నియంత్రించే అనేక గుణాలు పెరుగులో ఉంటాయి. దీనితో పాటు ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుంది. అంతేకాకుండా జుట్టు ని సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. ఇప్పుడు పెరుగు హెయిర్ స్పా క్రీమ్‌ను తయారుచేసే పద్ధతిని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

తయారీకి కావలసిన పదార్థాలు:

పెరుగు – 1 కప్పు
ఆవు పాలు – 1/2 కప్పు
తేనె – 2 స్పూన్లు
గుడ్డు – 1
ఆలివ్ నూనె – 1 టీస్పూన్

పెరుగు హెయిర్ స్పా క్రీమ్ ఎలా తయారు చేయాలి:

పెరుగు హెయిర్ స్పా క్రీమ్ ని తయారు చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో పెరుగు వేయండి. తర్వాత దానిని బాగా కలపండి. దీని తర్వాత అందులో ఆవు పాలు, తేనె, గుడ్డు వేయండి. తర్వాత వీటన్నింటిని బాగా మిక్స్ చేసి చిక్కని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. దీని తర్వాత 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. దీంతో పెరుగు హెయిర్ స్పా క్రీమ్ రెడీ అయినట్లే.

ఇలా ఉపయోగించండి

దీన్ని అప్లై చేయడానికి ముందుగా మీ జుట్టును బాగా కడుకోవాలి. దీని తర్వాత పూర్తిగా వెంట్రుకలను ఆరబెట్టాలి. తర్వాత తయారుచేసిన ఈ క్రీమ్‌ను బ్రష్ సహాయంతో జుట్టు మీద పూర్తిగా అప్లై చేయాలి. తరువాత కనీసం 30 నిమిషాలు వెంట్రుకలను వదిలేయాలి. తర్వాత జుట్టును సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News