Friday, July 11, 2025

పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని న్యూజల పాయ్‌గురిలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్-గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా గూడ్స్ బోగీలు పడి ఉన్నాయి. రైల్వే అధికారులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చాయని స్థానికులు తెలిపారు. రైలు పశ్చిమ బెంగాల్‌లోని సిల్దా నుంచి అస్సాంలోని సిల్‌చార్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  మృతుల సంఖ్య పది వరకు ఉండొచ్చని స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News