Monday, June 17, 2024

మధ్యంతర బెయిల్ పొడగింపు కోరిన కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో వారం రోజలు పాటు తన తాత్కాలిక బెయిల్ ను పొడగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో మనీ లాండరింగ్ కేసు కింద అరెస్టయినప్పటికీ ప్రస్తుతం తాత్కాలిక బెయిల్ పై బయట ఉన్నారు. పిఈటి-సిటి స్కాన్, ఇతర వైద్య పరీక్షలకుగాను తన తాత్కాలిక బెయిల్ ను పొడగించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు.

సుప్రీంకోర్టు ఇప్పటికే జూన్ 1 వరకు కేజ్రీవాల్ కు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల ప్రచారానంతరం తిరిగి లొంగిపోయి జూన్ 2 వరకల్లా కారాగారానికి తిరిగి రావాలని షరతు కూడా అప్పుడే విధించింది. కాగా తన మధ్యంతర బెయిల్ ను వారం రోజులు పొడగించాలని కోరుతూ కేజ్రీవాల్ తాజాగా పిటిషన్ వేశారు. ఆయన అరెస్టు అయ్యాక దాదాపు 7 కిలోల బరువు తగ్గారు. ఆయన కెటోన్ లెవల్ గణనీయంగా పడిపోయాయని ఆప్ నాయకురాలు ఆతిషి పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు అవసరమని డాక్టర్లు చెప్పినట్టు కూడా ఆమె తెలిపారు. అందుకనే పిటిషన్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News