Monday, June 17, 2024

ఫైనల్లో సన్‌రైజర్స్ చిత్తు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్-17 ఛాంపియన్ కోల్‌కతా

చెన్నై: ఐపిఎల్ సీజన్17లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలంది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన కోల్‌కతా 10.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గుర్బాజ్ 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.

చెలరేగి ఆడిన వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో కోల్‌కతా మరో 9.3 ఓర్లు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. కాగా, కోల్‌కతాకు ఇది మూడో ఐపిఎల్ ట్రోఫీ కావడం విశేషం. ఇక ఫైనల్లో సన్‌రైజర్స్ పూర్తిగా తేలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0)లు విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన త్రిపాఠి (9) నిరాశ పరిచాడు. మార్‌క్రమ్ (20), నితీష్ రెడ్డి (13), క్లాసెన్ (16), సమద్ (4), షాబాజ్ (8) తేలిపోయారు. కెప్టెన్ కమిన్స్ (24) కాస్త రాణించాడు. ప్రత్యర్థి జట్టులో రసెల్ మూడు, స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లను పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News