Monday, June 17, 2024

కెసిఆర్ ఆదేశాలతోనే బిఎస్సీ నుంచి బిఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి
మనతెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ ఆదేశాల మేరకే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బిఎస్సీ నుంచి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారని, ఈ విషయం అందరికీ తెలుసని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి ఆరోపించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కొల్లాపూర్, అచ్చంపేటను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని అంటున్నారని మల్లురవి మండిపడ్డారు. ఈ విషయంలో ఆర్‌ఎస్ వ్యాఖ్యలు ఖండిస్తున్నానన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా మాట్లాడుతు న్నారని ఆయన ఫైర్ అయ్యారు. అనంతపురంలో ఎస్పీగా ఉన్నప్పుడు పరిటాల రవి హత్య జరిగిందని, అప్పుడు నీ మీద చర్యలు తీసుకుందా అప్పటి ప్రభుత్వం అని మల్లురవి ప్రశ్నించారు. బుల్డోజర్‌తో కొల్లాపూర్‌లో ఇళ్లు కూల్చుతున్నారని ఆర్‌ఎస్‌పి ఆరోపిస్తున్నాడని, బుల్డోజర్‌లకు కాంగ్రెస్ వ్యతిరేకం అని మల్లురవి పేర్కొన్నారు. కరీంనగర్‌లో ఎస్పీగా ఉన్నప్పుడు బడుగు, బలహీన వర్గాల పిల్లల్ని కాల్చి చంపిన చరిత్ర నీది అంటూ ఆర్‌ఎస్‌పై మల్లురవి మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News