Monday, June 17, 2024

జూన్ 12 నుంచి పాఠశాలలు ఆరంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పాఠశాలల అకాడమిక్ క్యాలండర్ 2024-25 విడుదలయింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పనిచేయబోతున్నాయి. జూన్ 12న మొదలయి ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్నాయి. కాగా 2025 ఫిబ్రవరి 28లోపు పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు ముగియనున్నాయి. మార్చిలో ఫైనల్ పరీక్ష నిర్వహించనున్నారు.

సెలవుల విషయానికి వస్తే అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ఇదిలావుండగా పాఠశాలల్లో ఐదు నిమిషాలపాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. లంచ్ బ్రేక్ 45 నిమిషాలపాటు ఉంటుంది. ప్రతి ఆరు నెలలకు విద్యార్థులకు ఆరోగ్య పరీక్ష ఉంటుంది. ప్రతి విద్యార్థి అటెండెన్స్ 90 శాతం ఉండేలా చూడనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News