Thursday, May 23, 2024

జెకె బారాముల్లాలో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలో తీవ్రవాదులు, భద్రత బలగాలకు మధ్య తుపాకుల పోరు వరుసగ రెండవ రోజు శుక్రవారం కొనసాగగా ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు, ఇద్దరు సైనిక సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర కాశ్మీర్ సొపోర్‌లోని చెక్ మొహల్లా నౌపోరాలోఎన్‌కౌంటర్ గురువారం మొదలైందని, రాత్రి విరామం తరువాత శుక్రవారం ఉదయం తిరిగి కాల్పుల పోరు సాగిందని వారు తెలియజేశారు.

ఇంత వరకు ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని అధికారులు తెలిపారు. తుపాకుల పోరులో గాయపడన ఇద్దరు సైనిక సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వారు చెప్పారు. ఎన్‌కౌంటర్ ప్రదేశం సమీపంలో ఉన్న ఒక పౌరుడు కూడా గురువారం గాయపడ్డాడు. ఆ ప్రాంతం నుంచి ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం సాగుతోందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News