Tuesday, April 30, 2024

మందుల ధరలు పెంచడం పై మంత్రి హరీశ్‌రావు ఫైర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిజెపి పాలనలో అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సఛ్చే దిన్ అని మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం మందుల ధరలు పెంచడం పట్ల హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణమని మండిపడ్డారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్యగా ఆయన పేర్కొన్నారు.

జ్వరం, ఇన్ఫెక్షన్లు, బిపి, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800లకుపైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుందని గుర్తు చేశారు.సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని అన్నారు. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం,

చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్ధమైందనపి విమర్శించారు. ఇది అత్యంత బాధాకరమైన, దుర్మార్గమైన చర్యగా మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఇదేనా బిజెపి చెబుతున్న అమృత్ కాల్..??…..ఇవి అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్..అని దేశంలో బిజెపి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News