Saturday, June 3, 2023

నెలక్రితమే వివాహం.. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

కౌడిపల్లిః లారీ బైక్ డీకొని ఓ యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గేటు శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… మండల పరిధి ముట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన సుంచు అశోక్(28) తనకొత్త బైక్ రిజిస్ట్రేషన్ చేసే పని నిమిత్తం నర్సాపూర్ వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో తునికి గేటు శివారు ఎస్సార్‌పెట్రోల్ పంపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ అశోక్ బైక్ బలంగా డీకోట్టడంతో అశోక్ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు అశోక్‌కి సరిగ్గా నెల క్రితం వివాహం జరిగింది. యువకుడు మృతిచెందడంతో ముట్రాజ్‌పల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడు తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News