Monday, May 13, 2024

అరవింద్ కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎం.కె.స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: గవర్నర్లపై చర్య తీసుకోవాలన్న విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేరినందుకు ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. బిజెపియేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీర్మానాలు చేసి బిల్లులు ఆమోదించడానికి గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గతంలోనే పిలుపునిచ్చారు.

స్టాలిన్ తన ట్విట్టర్‌లో ‘తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానం విషయంలో చేరినందుకు కృతజ్ఞతలు. ఏ ప్రాజాస్వామ్యంలోనైనా శాసన సభ అత్యున్నతం. ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని, బాధ్యతలను తక్కువ చేసే అధికారం నియుక్తులైన ఏ గవర్నర్‌కు లేదు. మంట వ్యాపించని’ అని పేర్కొన్నారు. స్టాలిన్ ఏప్రిల్ 9న రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖల్లో ‘బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్లకు ఓ నిర్ణీత సమయం ఉంచాలి’ అన్నారు.

‘బిల్లును ఆపివుంచడం(విత్‌హెల్డ్) అంటే ‘ఖతం’ అయిపోయిందనే’ అని తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రకటన చేశాక తమిళనాడు శాసన సభ తీర్మానాన్ని తీర్మానం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News