Wednesday, September 17, 2025

ఈద్గా ప్రార్థనలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణా రాష్ట్రం ప్రతీక గా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలు దోహద పడ్డాయని ఆయన తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సూర్యపేటలోని ఈద్గాలో జరిగిన ప్రార్ధనలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో అలాయ్ బాలయ్ తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.

రంజాన్ మాసంలో నెల రోజులుగా కఠోరమైన దీక్ష చేపట్టి రంజాన్ పర్వదినం రోజున విడిచి భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సమాజానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. యావత్ సమాజం సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ శాంతిసామరస్యాలు ఫరీడ విల్లాలన్న సంకల్పంతో నెల రోజులుగా కఠోర దీక్షలు చేసిన వారి ప్రార్ధనలకు అల్లాయే మోక్షం కలిగిస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News