Thursday, May 2, 2024

కాస్త మానవత్వం చూపండి: ఎస్‌బిఐకి నిర్మలా సీతారామన్ క్లాసు (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: పెన్షన్ తీసుకోవడానికి ఒక నిరుపేద వృద్ధురాలు మండే ఎండలో కాళ్లకు చెప్పుల్లేకుండా విరిగిపోయిన కుర్చీనా ఊతంగా చేసుకుని బ్యాంకుకు వెళుతున్న వీడియో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను చలింప చేసింది. వ్యవహరించండి అంటూ దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకు ఎస్‌బిఐ అధికారులను నిర్మలా సీతారామన్ మందలించే పరిస్థితిని ఈ వీడియో కల్పించింది.
వీడియోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు సూర్య హరిజన్. ఒడిశాలోని నబ్రంగ్‌పూర్ జిల్లా జరిగావ్‌లో నివసిస్తోంది ఇతరులకు చెందిన పశువులకు కాపరిగా పనిచేస్తున్న చిన్న కుమారుడి వద్ద ఒక పూరి గుడిసెలో ఆమె ఉంటోంది. ఆమె పద్ద కుమారుడు పని కోసం వేరే రాష్ట్రానికి వలసపోయాడు.

ఆమెకు సొంతదంటూ పొలం కానీ ఇల్లు కానీ ఏవీ లేవు.తన ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేసిన నిర్మలా సీతారామన్ ..ఎస్‌బిఐ మేనేజర్ స్పందించడం చూశాను. అయినప్పటికీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(డిఎఫ్‌ఎస్), ఎస్‌బిఐ ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతాపరంగా చర్యలు తీసుకోవాలి. బ్యాంక్ మిత్రా ఎవరూ అక్కడ లేరా..అంటూ ఆమె ప్రశ్నించారు. ఏప్రిల్ 17న ఈ వీడియో వెలుగు చూసింది.నిర్మలా సీతారామన్ ట్వీట్‌కు ఎస్‌బిఐ వెంటనే స్పందించింది. వచ్చే నెల నుంచి ఆ వృద్ధురాలికి పెన్షన్‌ను ఆమె ఇంటి వద్దనే అందచేస్తామని, ఆమెకు ఒక వీల్ చెయిర్ కూడా అందచేస్తామని
ఎస్‌బిఐ తెలిపింది.
అయితే..బ్యాంకు రికార్డులలో ఉన్న థంబ్ ఇంప్రెషన్(బొటనవేలు ముద్ర)కు ఆమె థంబ్ ఇంప్రెషన్‌కు సరిపోలకపోయిన కారణంగానే ఆమెను స్వయంగా వచ్చి పెన్షన్ తీసుకోవాలని బ్యాంకు అధికారులు గతంలో ఆదేశించిన కారణంగానే ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు వార్తలు చెబుతున్నాయి.ఆమె చేతి వేళ్లు విరిగిపోయాయని, డబ్బు విత్‌డ్రా చేసుకోవడంలో ఆమె ఇబ్బంది పడుతోందని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎస్‌బిఐ జరిగావ్ బ్రాంచ్ మేనేజర్ అన్నట్లు వార్తాసంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News